Take a fresh look at your lifestyle.

ఇంటర్ ఉత్తీర్ణులకు కలెక్టర్ శుభాకాంక్షలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష తెలిపారు. ఈ మేరకు ఆమె విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో, నిర్మల్ జిల్లా 62.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 12 వ ర్యాంక్, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 73.43 శాతం ఉత్తీర్ణతో 13 వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం పై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు పై తరగతుల్లో మరింత కష్టపడి చదివి, ఉన్నతంగా నిలవాలని ఆకాంక్షించారు. అనుత్తీర్ణులైన విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా కృషిచేసిన అధ్యాపకులు, తల్లిదండ్రులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలపాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.