- కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.
ముద్ర,తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ మూడున్నరేళ్ల తర్వాతేకాదు, ముప్పై ఏళ్ల దాకా ప్రతిపక్షంలోనే ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జ్యోస్యం చేప్పారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన విధ్వంసానికి ప్రజలు వాళ్ళను క్షమించరని అన్నారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ధారత్తం చేసిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భయం కేటీఆర్‌కు పట్టుకుందన్నారు. అందుకే అసత్య ప్రచారంలో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం పేరుతో 7 వేల ఎకరాల అటవీ భూములు తీసున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమనే విషయాన్ని విస్మరించరాదన్నారు. దేవాలయ, అసైన్డ్ భూములను చరబట్టిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులదేనని ఆయన దుయ్యబట్టారు. ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పాలకులదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళకుండా 400 ఎకరాల భూమిని న్యాయ స్థానంలో కొట్లాడి ప్రభుత్వానికి దక్కేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న అసత్యప్రచారంపై యువకులు, నిరుద్యోగులే వారికి సమాధానం చెప్తారని ఎమ్మెల్సీ వెంకట్ అన్నారు.