Take a fresh look at your lifestyle.

60 డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం

  • ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమే.
  • డివిజన్ల విభజన సవ్యంగానే జరుగుతుంది.
  • అదనపు కలెక్టర్ అరుణశ్రీ వెల్లడి.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో అన్ని బర్గాల నుండి ఫిర్యాదులు వినతులు వస్తున్నాయని ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమే అని అభ్యంతరాలను స్వీకరించి ప్రజలకు అనుకూలంగా డివిజన్ల పునర్విభజన సవ్యంగానే సాగుతుందని అదనపు జిల్లా కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ అరుణ శ్రీ వెల్లడించారు.గురువారం ఆమె ముద్ర ప్రతినిధితో మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వార్డులో విభజన 60 డివిజన్లను డ్రాఫ్ట్ గా ప్రకటించడం జరిగిందని అన్నారు. డివిజన్ల పునర్విభజన కోసం అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని కొన్ని డివిజన్లోని కొన్ని ప్రాంతాలు నగరాలు లేకపోవడం పై అభ్యంతరాలు వస్తున్నాయని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మునిసిపల్ సిబ్బంది అధికార యంత్రంతో చర్చించి డివిజన్ల పునర్ విభజన సభ్యంగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.