Take a fresh look at your lifestyle.

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే మందుల సామెల్.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం మండలంలోని దాచారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే మహిళా సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాచారం గ్రామంలో మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా మొదటి విడుత 21 ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందని రెండో విడతలో మరో 15 ఇండ్లు దాచారం గ్రామానికి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రధాని సమస్య అయినటువంటి 273 సర్వేనెంబర్ భూములకు సంబంధించి రైతులకు పట్టాదారు పాసు బుక్కులు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లగా తాహాసిల్దార్ జ్యోతిని ఇట్టి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పొడిచేడు నుండి దాచారం వరకు త్వరలో బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం, ఉప సర్పంచ్ భీమనబోయిన ఆయిలయ్య ఎపిడి జంగా రెడ్డి, తాహాసిల్దార్ జ్యోతి, పంచాయితీ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.