Take a fresh look at your lifestyle.

తెలంగాణలో అరాచన పాలనపై మౌనమేలా..?-రాహుల్ గాంధీకి ఎంపీ ఈటల సూచన

పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై దాడి జరుగుతోంది
తెలంగాణ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

న్యూఢిల్లీ :

తెలంగాణలో కొనసాగుతోన్న అరాచక పాలన… పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై జరుగుతోన్న దాడుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాలన్న ఆయన.. లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పట్టుకుని తిరుగుతోన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పాలన ఉన్న రాష్ట్రంలో మీరు చేస్తుంది ఏంటి? అని నిలదీశారు. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెద్దలు రూ.వేల కోట్ల భూములు అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదన్నారు. కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాలు ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేదల ఇళ్లు మాత్రం కులగొడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయడం, కూల్చడాన్ని ఖండించారు. మధు పార్క్ అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్న ప్రజల ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పేదలకు భూములు, ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇళ్లును కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొట్టడాన్ని ఖండించారు. ఇల్లు కోల్పోయిన పేదలకు తక్షణమే ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం పేరుతో బుకాయిస్తే ఖబర్దార్.. అంటూ హెచ్చరించారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ కట్టుకోవాలన్నారు. కేంద్రం అభివృద్ధి కోసం భూములు ఇచ్చిందన్న ఆయన పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ మందులు, బకాయిలకు, డైట్ చార్జీలకు నిధులు లేవని చెప్పి రూ.5 వేల కోట్లు పెట్టి గాంధీ పార్క్ కడతామంటున్న సీఎం.. ముందు అవి చేసి తర్వాత ఏదైనా కట్టుకోవాలని సలహా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.