Take a fresh look at your lifestyle.

సింగూర్ ఆ నకట్ట పనులులను నాన్యతతో చేయాలి. – నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ.

– ముద్ర ప్రతినిధి సంగారెడ్డి.
సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులను పరిశీలిస్తున్న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్
సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులు మరో యాబై సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండే విదంగా నాన్యతతో కూడిన పనులను చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీం చైర్మన్ విజయ్ త్రయంబక్ దేశాయ్ అన్నారు.

బుధవారం సింగూర్ ప్రాజెక్ట్ అనకట్ట పనులను నేషనల్ డ్యాం సేఫ్టీ బృదంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. ఆనకట్ట రివిట్ మెంట్ 6 కిలోమీటర్ల వరకు కుంగిపోవడంతో ప్రాజెక్టుకు ఏలాంటి ప్రమాదం జరుగకుండా నేషనల్ డ్యాం సేస్టి అథారిటి సూచనల మేరకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలకు త్రాగు నీటికి ఇంబ్బంది లేకుండా 8 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ పనులను వచ్చే జూన్ నెల వరకు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలని ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. అవసరమైతే నీటిని దశల వారిగా దిగువకు విడుదల చేస్తామని అన్నారు. పనులు జరుగుతున్నందున రైతులకు క్రాఫ్ హాలీడే ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డ్యాం సేప్టీ అథారిటి బృందం సభ్యులు మురళిదర్, సతీష్ కుమార్, రెగొండ, శ్రీకాంత్, రాజు, లక్ష్మణ రావ్, ఇరిగేషన్ శాఖ సీఈ రాజమ్మ, ఎస్ఈ రఘునాథ్ రావ్, ఈఈ భీమ్, డీఈ నాగరాజులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.