Take a fresh look at your lifestyle.

కేసీఆర్ చరిష్మ ఉన్న నాయకుడు

  • అలాంటి లీడర్ తెలంగాణలో మరొకడు లేడు.
  • కేసీఆర్‌పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉంది.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో ఇంకొకరు లేరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.కేసీఆర్ పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉందన్నారు.గత సభలన్నింటినీ తలదన్నేలా ఎల్కతుర్తి సభ జరిగిందన్నారు.ఈ సభ కాంగ్రెస్ పార్టీకి కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.ఎల్కతుర్తి సభ రేవంత్ పాలన పై రెఫరండం లాంటిదేనని, ప్రజలు రేవంత్ వైపు లేరని, కేసీఆర్ వైపే ఉన్నారని రుజువైందని అన్నారు.ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె. కిషోర్ గౌడ్, ఉపేంద్రాచారి, డాక్టర్ కురువ విజయ్ కుమార్‌లతో కలిసి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడారు తెలంగాణ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని, అంతమాత్రానా తెలంగాణ కు కాంగ్రెస్ చేసిన పాపాలు మాయమవుతాయా ? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ కు విలన్ నెంబర్ వన్ అని కేసీఆర్ అనడం లో తప్పేమి లేదని అన్నారు. బీఆర్ఎస్ సభ సక్సెస్ అయిన తర్వాతా రేవంత్ సిద్ధం చేసుకున్న స్క్రీఫ్ట్ ను మంత్రుల చదివారని ఆయన ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరు చూసి బాధతో కేసీఆర్ సభలో మాట్లాడారని అన్నారు.తెలంగాణలో 24 గంటల కరెంటు, సాగునీళ్లు, తాగునీళ్లు, రైతుబంధు,రైతు బీమా, ఆసరా,ఐటి, రియల్ ఎస్టేట్అన్ని రంగాలను కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రులు ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఎన్నికలముందు ఫోటో షూట్ చేసిన వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు మెట్ల దగ్గర ఉన్నారని ఆయన విమర్శించారు.అన్ని తప్పులు చేస్తున్న చిల్లర గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు , బిల్డర్లు కళ్ళలో రక్తం కనిపిస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, సీఎం మధ్య సమన్వయం లోపించిందని ఆయన విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.