Take a fresh look at your lifestyle.

అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి-కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

 

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి

ముద్ర, నారాయణ పేట:

వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత అధికారిదే పూర్తి బాధ్యత అని ఆమె తేల్చి చెప్పారు. మరికల్ మండలం తీలేర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. కేంద్రానికి ఇంత వరకు ఎంత మంది. రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తీసుకువచ్చారని, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సీ.ఈవో ను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది రైతులు తమకు గన్ని బస్తాలు ఇవ్వలేదని, కేంద్రంలో గన్ని బస్తాలు ఎక్కువ ఉంచాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆమె సూచించారు. తమకు ఇంతవరకు అధికారులు టార్ఫాలిన్లూ ఇవ్వలేదని, తామే ఇంటి నుంచి తీసుకువచ్చి సాయంత్రం ధ్యానం పై కప్పి వేస్తున్నామని కొందరు రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ధన్వాడ పీ.హెచ్.సీ ని తనిఖీ చేసిన కలెక్టర్

ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు వార్డులను పరిశీలించారు. మందులను చూసి, గడువు తీరిన మందులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. టీకాల గదిని చూశారు. వ్యాక్సినేషన్, ఈఎన్ సీ, ఎన్.సీ. డీ నమోదు గురించి ఆరా తీశారు. ఎంత మంది స్టాఫ్, ఏ ఎన్ ఎం లు ఉన్నారని మెడికల్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. కేంద్రంలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, గత నెలలో నమోదైన గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో జరగాల్సిన ప్రసవాలలో ఎన్ని ఆస్పత్రిలో జరిగాయి?.. ఎన్ని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు?. ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయి?. ఎన్ని సెక్షన్ జరిగాయని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే వివరాల గురించి ఆమె వాకబు చేశారు.

Leave A Reply

Your email address will not be published.