Take a fresh look at your lifestyle.

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

 

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి

జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్

ముద్ర, నారాయణపేట:

ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టిఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలోని 28 గ్రామాల్లో గ్రామ కమిటీలు వేయడం జరిగిందన్నారు. నెల రోజులపాటు జరిగే జెండా పండుగ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ప్రతి పేద కుటుంబానికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం, రైతు సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని, యువతకు నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే రూ.20 కోట్ల వరకు రుణ సహాయం అందించే విధానాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లేనందున ప్రజలు నాన అవస్థలు పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు యంత్రాంగం పాలకులు స్పందించే జిల్లా కేంద్రంలో ఆసుపత్రి సేవలు అందేలా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను కేవలం రెండు ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి రైతులను అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామన్నారు. పట్టణ అధ్యక్షులు చంద్రు, నీలి జనార్దన్, శివ శంకర్, వెంకటప్ప, నారాయణ రెడ్డి, భీంశప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.