ముద్ర మల్కాజ్‌గిరి
ఉప్పల్ నాగోల్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో నూతనంగా ఏర్పడిన మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిచయ వేదికతో పాటు 2027 జనగణన, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యలు, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
ఈ సమావేశానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మచ్చ బొల్లారం డివిజన్‌లో హిందూ స్మశానవాటికలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని, స్వచ్ఛ మిషన్ కింద రాంకీ సంస్థ ప్లాస్టిక్ వ్యాపారం నిర్వహిస్తున్న అంశంపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన జేసీబీలు, బాబ్‌క్యాట్ వాహనాలు లేకపోవడంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బంది సంఖ్య పెంచాలని సూచించారు.
సఫిల్‌గూడ, బండ చెరువు, కొత్త చెరువు, మోతుకులకుంట చెరువుల్లో గుర్రం తొలగింపు పనులు వేగవంతం చేయాలని కోరారు. అలాగే 2002 జనాభా ప్రాతిపదికన చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ మ్యాపింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
కేటాయించిన నేపథ్యంలో రీ-అలైన్‌మెంట్ పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే ఏఓసీ అదనపు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన రూ.910 కోట్ల ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న సుమారు 28 కిలోమీటర్ల సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వైకుంఠధామం లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ స్మశానవాటికల్లో కనీస వసతులు కల్పించాలని
ఎమ్మెల్యే ప్రస్తావించిన అన్ని అంశాలపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, శ్రీదేవి రెడ్డి సుధీర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.