Take a fresh look at your lifestyle.

కథలాపూర్ మండలం కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్….

ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట

ఎన్నికలు ఉన్నప్పుడే వచ్చే నాయకుణ్ణి కాదు….

ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడిని….

కోరుట్ల, ముద్ర;
ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కథలాపూర్ మండల కేంద్రంలో పర్యటించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను విప్ ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని అర్హులైన 86 మంది లబ్ధిదారులకు 31 లక్షల 81 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు నేడు నిర్విరామంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, మొక్కజొన్న క్వింటాలుకు 2400 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, కథలపూర్ మండలంలో పోసానిపేట, సిరికొండ గ్రామంలో నూతన 33/ 11 కేవీ విద్యుత్ ఉపకేంద్రo, కథలపూర్ మండల కేంద్రంలో 220 సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలికోట సూరమ్మ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సాధించారని అన్నారు. ప్రజలు రైతులు ప్రాజెక్ట్ సందర్శన చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు మూడు సార్లు వరద కాల్వ కు నీటిని విడుదల చేశామన్నారు.

ఎన్నికలు ఉన్నప్పుడే వచ్చే నాయకులను నమ్మవద్దనీ, ఎన్నికలు ఉన్నా లేకున్నా తను ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. విప్ వెంట కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కాయితీ నాగరాజు, మార్కెట్ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి, చెదలు సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.