Take a fresh look at your lifestyle.

స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ కేటీఆర్

అధికారంలో ఉన్న వారికి అనుకూల నిర్ణయాలకు ఉదాహరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదనీ అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని చెప్పారు. బుధవారం మీడియాకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే.. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న కేటీఆర్… సరైన సమయంలో సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎందుకు పిలవలేదు..? : దానం
ఈ అంశంపై దానం నాగేందర్ సైతం స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్ లపై మండిపడ్డారు. ఈ నెల 10న జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని నిలదీశారు. సీఎం కాలేదని కేసీఆర్‌కి ఇబ్బంది లేదన్న ఆయన ఆ పదవి పోయిందని కేటీఆర్ కి చాలా ఇబ్బంది పడుతున్నారని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయిక అన్నారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ లేకపోయేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానన్న దానం ఎక్కడా సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. శాసనసభలో ఎక్కడా విప్ జారీ కాలేదనీ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పని చేయలేదని చెప్పారు. తాను యుద్ధంరంగం నుంచి వచ్చిన వాడినన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచే వాడినన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం సీఎం రేవంత్ రెడ్డిపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కొందరు అనుకుంటున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి చెప్పారు. రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఏంటని కొందరు మదనపడుతున్నారు. ఎంత డీ మోరల్ చేసిన సీఎం డీ మోరల్ కాలేదన్నారు. ముఖ్యమంత్రి ఆశించినట్టే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.