Take a fresh look at your lifestyle.

మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల;
మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన గుండెల లక్ష్మి 59 అనే వృద్ధురాలు బుధవారం రోజు మధ్యాహ్నం సమయంలో మృతురాలికి ఆమె భర్త రాజన్న కు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన లక్ష్మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లింది. ఎంతకు రాకపోయే సరికి రాత్రి వరకు వెతికారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో రాజేశ్వరరావుపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ వరద కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మరణం పై ఎలాంటి అనుమానం లేదని మృతురాలు చెల్లె ఆసరీ గౌరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై జీ. నవీన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.