Take a fresh look at your lifestyle.

శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

ముద్ర,రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రోజున కన్నుల పండుగగా జరిగింది.మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడిబియ్యం, కుడుకలు,కనుములు అందజేశారు.అనంతరం స్వామివారిని తులాభారం చేసి, భక్తులందరికీ అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, నాయకులు, యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.