Take a fresh look at your lifestyle.

అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు ప్రాణ సంకటం

ముద్ర,రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో పెద్ద చెరువు నుండి రాయికల్ పట్టణ ఫీల్టర్ బెడ్ వరకు నీటిని తరలించే క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లో లీకేజ్ కారణంగా మరమ్మత్తుల కోసం చెరువుకు వెళ్లే మార్గంలో పెద్ద, పెద్ద గుంతలు తీసి ప్రమాద సూచికలు లేకుండా లోతైన గుంతలు తీసి పెట్టారు.కానీ సమీప కాలనీ ప్రజలు,చేపల వేటకు వెళ్లే గంగ పుత్రులు నిత్యం అవసరాల కోసం చెరువు వద్దకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.కనుక అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి మరమ్మతులు చేసే పని వద్ద ప్రమాద సూచిక బోర్డులు పెట్టి ప్రజలకు అసౌకర్యం కలవకుండా చూడాలని కాలనీ ప్రజలు కోరుచున్నారు.ఇట్టి విషయమై కాలనీ సభ్యుడు గుర్రం స్వామి మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఇలాంటి మరమ్మతులు పని జరిగేటప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలరు అని అధికారులను విన్నవించుకుంటున్నాం.

Leave A Reply

Your email address will not be published.