కర్ల రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీస్ ల హత్యే
ఎస్ఐ సురేష్ రెడ్డి ని కాపాడుతుంది మంత్రి ఉత్తమ్ దంపతులే
రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిచే సమయం డీజీపీ కి లేదా..?
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
ముద్ర నడిగూడెం.…. కర్ల రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీస్ ల హత్యే అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు సైదులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కర్ల రాజేష్ సంతాప సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅధితిగా హాజరై మాట్లాడుతూ…సీఎం రిలీఫండ్ కేసులో ఏ4 గా ఉన్న రాజేష్ ను పోలీస్ లు చిత్రహింసలు పెట్టడం తోనే రాజేష్ మరణించాడని అన్నారు. రాజేష్ మృతి కి కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాన్నికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మాత్రం రెడ్డి పోలీస్ అధికారులను కాపాడుకునే పనిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు లో రాజేష్ పై కేసు నమోదు నుండి మొదలు పోస్ట్మార్టం వీడియో రికార్డు చేసే వరకు అందరూ రెడ్డి లే ఉన్నారు కాబ్బట్టి ఉత్తమ్ దంపతులు మౌనం గా ఉంటున్నారని అన్నారు. రాజేష్ మృతి పై ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు స్పందించకుంటే రాజేష్ మృతి నే వారికి రాజకీయ సమాధి కడుతుందని హెచ్చరించారు. రాష్ట్రం లో ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బీజేపీ,సిపిఎం, సిపిఎం అగ్రనాయకులతో పాటు, లాకప్ డెత్ జరిగితే పరామర్శించే సమయం రాష్ట్ర డిజిపి కి దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఈ సభ లో హై కోర్టు న్యాయమూర్తి అంబెడ్కర్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సత్యనారాయణ, నడిగూడెం మాజీ సర్పంచ్ సుధాకర్,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, ఎంజెఎఫ్ నాయకులు రాంబాబు, బీజేపీ నాయకుడు రామకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, జలిల్, మహేష్,ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అర్జున్,శ్రీను,తదితరులు పాల్గొన్నారు