ముద్ర , చిలుకూరు ….. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలోని కవిత జూనియర్ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమం విజయవంతమైనట్లు ఆయా సంఘాల జిల్లా బాధ్యులు చేపూరి కొండలు, తమ్మనబోయిన నరేష్ లు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ కు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 887, మంది విద్యార్థులు హాజరైనట్లు వారు తెలిపారు. టాలెంట్ టెస్ట్ ప్రారంభానికి ముందు సిపిఐ సీనియర్ నాయకులు కస్తూరి సైదులు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అంబాల వెంకటి ల చేతుల మీదగా ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టాలెంట్ టెస్టులు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికితీయటానికి దోహద పడతాయని అన్నారు. టాలెంట్ టెస్ట్ విజేతలకు ఈనెల 5వ తేదీన బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు, కవిత జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మాదాల శ్రీధర్, చిలువేరు ఆంజనేయులు, సిరాపురపు శ్రీనివాసరావు, కొల్లు శ్రీనివాస్, ఎస్ టి యు నాయకులు కొండ వెంకయ్య, ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్ష కార్యదర్శులు, అనంతుల రాము, కడారు మధు, వెంకటేష్, సాకి నరేష్, డేగ వీరన్న, కొల్లు శ్రీకాంత్, వెంకటలక్ష్మి, సాయి వర్షిత, అనూష, నిక్షిత, వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.