ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకొచ్చే కృషి..
రామన్నపేటలో నాలుగు కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన జస్టిస్ పి శ్యామ్ కోసి కే శరత్..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :

ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకొచ్చే కృషి చేస్తున్నట్లు జస్టిస్ పి శ్యామ్ కోసి కే శరత్ అన్నారు. ఆదివారం రామన్నపేటలో నాలుగు కోర్టు ల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకొచ్చే కృషి చేస్తున్నామని ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. జస్టిస్ కూనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ రామన్నపేటలో భవన సముదాయం త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. నిర్మాణంలో అనేక ఆటంకాలు ఉంటాయనించి వాటన్నిటినీ అధిగమించి పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, జస్టిస్ సృజన, కళాసికం, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జ్ జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్స్ సివిల్ జడ్జ్ ఎస్.శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మజీద్, సీనియర్ న్యాయవాదులు యపల కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, కంపాటి యాదగిరి ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మోగులయ్య, జినుకల ప్రభాకర్, హనుమంతు గౌడ్,రామ దాసు, ప్యానల్ లాయర్ మామిడి వెంకటరెడ్డి, ఏజిపి సుక్క శ్రవణ్ కుమార్, బి.అశోక్ కుమార్, జగతయ్య, డేవిడ్, బాలరాజు, దినేష్, శ్రీశైలం, స్వామి, రమేష్, అజీజ్, జితేందర్, తదితరులు
పాల్గొన్నారు.