Take a fresh look at your lifestyle.

లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ తీర్పుపై BJP నేతల వ్యాఖ్యలు

లిక్కర్ కేసులో వాళ్లు నిర్దోషులు కారు
సాంకేతిక కారణాలతోనే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది
సిబీఐ పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేస్తూ.. అక్కడి రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన మాత్రానా నిందితులంతా తప్పు చేయలేదని అర్థం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. టెక్నికల్ కారణాలతోనే కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. అంత మాత్రం చేత ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులుగా ఉన్న వారు.. తప్పు చేయలేదని అర్థం కాదని వెల్లడించారు. ఈ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసినంత మాత్రాన వారు నిర్దోషులు అయిపోరు అని తెలిపారు. ఒకవేళ వారు అలా భావిస్తే.. ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శలు గుప్పించారు. శుక్రవారం రాత్రి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని రామచందర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ.. పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత తీర్పు కేవలం ట్రయల్ కోర్టు నుంచి వచ్చింది మాత్రమేనన్న ఆయన పై కోర్టుకు వెళ్తే తీర్పు మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

కవిత నిర్దోషని కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు : ఎంపీ అర్వింద్

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నిర్దోషని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ కేసులో కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు చెప్పిందన్న ఆయన అంతలోనే సంబరపడితే ఎలా అని ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటి కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.