తుంగతుర్తి, ముద్ర: విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రావులపెల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ గొర్ల కృష్ణయ్య కు చెందిన గేదె పంట పొలాల్లో మేతమేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైరు తాకడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన గేదె విలువ 50 వేలు పైగా ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు