Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ రంగాలను ధ్వంసం చేయడమే మోడీ లక్ష్యం

  • పెంచిన రైల్వే ఛార్జీలు తగ్గించాలని నున్నా డిమాండ్. 
  • ఖమ్మం రైల్యే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: గత 11 ఏళ్లుగా లాభాలను ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి, తన మిత్రులు అంబానీ, అదానీలకు కారు చౌకగా కట్టబెట్టే పనిలో దేశ ప్రధాని మోడీ బిజీ గాఉన్నారని నున్నా నాగేశ్వర రావు విమర్శించారు. ఇప్పుడు మోడీ చూపు లక్షల కోట్ల విలువ చేసే రైల్వే ఆస్తులపై పడిందని, రైల్వే స్టేషన్లను, ట్రైన్లను అదానీ కంపెనీకి ఇస్తున్నారని ఆరోపించారు. పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నున్న నాగేశ్వర రావు మాట్లాడుతూ కేంద్రం పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రయాణించే రైల్వే ఛార్జీలను పెంచి, ప్రయాణికులను ఆర్ధికంగా దెబ్బ తీయడమే కాకుండా, వారి ప్రయాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక భారాన్ని మోపిందని ధ్వజమెత్తారు. వెంటనే పెంచిన రైల్వే చార్జీలను తగ్గించి ప్రయాణికులపై భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే. పెరిగి పోయిన నిత్యవసర ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ప్రతి కిలోమీటర్ పై రైల్వే చార్జీలను పెంచడం, సామాన్య ప్రజలకు ఎంతో భారంగా మారుతుందన్నారు. ప్రయాణికులు వెహికల్స్ పెట్టుకునే రైల్వే పార్కు చార్జీలను కూడా అధికంగా పెంచి, వారి వద్ద నుండి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బందిగా మారే ఈ అధిక భారాలను ప్రభుత్వం వెంటనే తగ్గించక పోతే  రానున్న కాలంలో ప్రజల పక్షాన పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, నాయకులు ఏంఏ జబ్బార్, డి. తిరుపతి రావు, ఎన్.నవీన్ రెడ్డి, బి సుదర్శన్, భుక్యా శ్రీనువాస రావు, బి.ఉపేందర్, ఎస్కే నాగులు మీరా, పి. నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.