ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల ఆరోగ్యం కోసం ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలించింది. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అభ్యర్థన మేరకు బిడిఎల్ తన సీఎస్సార్ నిధులతో ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని సమకూర్చింది. ఈమేరకు గవర్నర్ శివ ప్రకాష్ శుక్ల లోక్ భవన్ వద్ద ఎంపీ రఘూనందన్ రావుతో కలిసి ప్రారంభించారు. మెదక్ ప్రజలకు క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించేందుకు అవసరమైన పూర్తి స్క్రీనింగ్ సదుపాయాలతో ఈ వాహనం అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఉండే సకల స్క్రీనింగ్ సౌకర్యాలు ఈ మొబైల్ వాహనంలోనే ఉండటం విశేషం.
ఈ సేవలను మెదక్ పార్లమెంట్ ప్రజలు వినియోగించుకోవాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనలో ఈ వాహనం ఒక ముందడుగు అని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీడీఎల్ అధికారులు పాల్గొన్నారు.