కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: కథలాపూర్ మండల కేంద్రంలోని మాస్ట్రో కిడ్స్ ప్లే స్కూల్లో ప్రథమ వార్షిక వేడుకలు శనివారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై జి. నవీన్ కుమార్ హాజరయ్యారు. ఎస్సై మాట్లాడుతూ కథలాపూర్ మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతంలో హైదరాబాదులో లాంటి మహా నగర స్థాయిలో ఉండే వసతులతో కూడిన ప్లే స్కూల్ ను స్థాపించి విద్యార్థులకు చిన్నతనంలోనే విద్యపై పట్టు అనే కార్యక్రమాల ద్వారా పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు నగర విద్యార్థులతో పోటీపడే విధంగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్న యాజమాన్యాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆకుల రాజేందర్, రంజిత్, సురేందర్, రాజేష్, ప్రిన్సిపల్ మమత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.