- మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొండ్ర మల్లారెడ్డి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడిన గొప్ప నాయకుడని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అన్నారు.సారంగాపూర్ మండల కేంద్రంలో కొండ్ర మల్లారెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొని మల్లారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా కేవలం రాజకీయ పార్టీకే పరిమితం కాకుండా అందరివాడిగా గుర్తింపు పొందినటున నాయకుడు మల్లారెడ్డి అన్నారు.ప్రజా జీవితంలో వారికున్న అనుభవం ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు రైతాంగం కానీ రైతు కూలీలు కానీ ఈ ప్రాంతం అటవీ ప్రాంతం అడవి పై ఆధార పడే అటువంటి గిరిజన బిడ్డలకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడేవారు స్థానిక సంస్థల బలోపేతం కొరకు సహకార రంగం సంస్థ బలోపేతం కొరకు ఈ రెండు రంగాలలో ఆయనకు ఉన్న విశేష అనుభవం ఉమ్మడి జిల్లాలోనే గ్రంధాలయ చేర్మెన్ గా సేవలు అందించారని అన్నారు.కేవలం సారంగపూర్ మండలం లోని కాకుండా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయిన వారి సలహాలు సూచనలు ఉండేవి అని అన్నారు కలమడుగు వంతెన నిర్మాణం కానీ ఏ కార్యక్రమం అయిన వారి సూచనలు ఉండేవి అని అన్నారు.బీర్పూర్ రాజుల చెరువు రోళ్ల వాగు .25 టీఎంసీ తో ఉన్న ప్రాజెక్టు రోళ్ల వాగు అదునికరణ అని 1 టీఎంసీ రూపొందించాలని 60 కోట్ల ప్రాజెక్టుని 150 కోట్లకు తీసుకెళ్లారు రోళ్ల వాగు ప్రాజెక్టుని మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంచంద్ర రెడ్డి , మాజీ ఎంపీపీ రమేష్ మాజీ జడ్పీటీసీ సరళ, సింగిల్ విండో చేర్మెన్ నవీన్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, మహంకాళి రాజన్న బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ పాల్గొన్నారు.
