- ఏమ్మెల్యే డా. కల్వకుంట్లసంజయ్.
కోరుట్ల, ముద్ర: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారీలకు అమ్ముకోకుండా ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏకీన్ పూర్ పరిధిలోని సంగెం, నాగులపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల శాసనసభ్యులు డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ సంఘ అధ్యక్షులు సింగిరెడ్డి నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ, ఏంఏఓ, ఏఈఓ దారిశెట్టి రాజేష్, చీటీ వెంకట్రావు, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెప్యాల నర్సయ్య, సంఘ కార్యవర్గ సభ్యులు సుధవేణి శ్రీనివాస్, జక్కని గణేష్, కొమ్ముల మోహన్ రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, గడ్డం పద్మ, జలందర్ రెడ్డి, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.