Take a fresh look at your lifestyle.

శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

కోరుట్ల, ముద్ర: కోరుట్ల ఐబి రోడ్ లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్టలో భాగంగా శుక్రవారం రోజు శివ పంచాయతన సహిత నందీశ్వర, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన, కార్యక్రమాన్ని వేకువజామున అర్చకులు పాలెపు రాముశర్మ వైదిక నిర్వహణలో యంత్ర స్థాపన, బలిహరణం, పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ట, కలశ ఉద్వాసన, శాంతి కల్యాణం, మహాదాశీర్వచనం,హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమంను అర్చక బృందం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమoలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నీలి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, కోశాధికారి పుప్పాల శేఖర్, ఉపాధ్యక్షులు పుప్పాల భాస్కర్, బండారి వెంకటి, జాప భూమయ్య, చెదలు నరసయ్య, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.