ముద్ర,పానుగల్: పానుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఫైనాన్స్ లిటరసీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఇందులో భాగంగా ఆర్.బి.ఐ కౌన్సిలర్ శ్రీ ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ డబ్బు ఏ విధంగా పొదుపు చేయాలి, సైబర్ నేరాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇన్సూరెన్స్ వలన కలిగే లాభాలు,ఇలాంటి అనేక విషయాలను క్షుణ్ణంగా వివరించారు.విద్యార్థులకు అనేక అంశాలపై అమూల్యమైన సందేశమును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి. విజయ్,సీనియర్ ఉపాధ్యాయుడు చిన్ననాగన్న,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు