Take a fresh look at your lifestyle.

నాలాల క‌బ్జాల‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్

  • ప్యాట్నీ, రసూల్పుర, చికోటి గార్డెన్స్ ప్రాంతాల్లో పర్యటన.

ముద్ర, తెలంగాణ బ్యూరో : నాలాల క‌బ్జాల‌పై హైడ్రా దృష్టి పెట్టింది. సోమ‌వారం ప్ర‌జావాణిలో నాలాల క‌బ్జాల‌పై ఫిర్యాదుల‌ను అందుకున్న హైడ్రా గురువారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది.జీహెచ్ఎంసీ, ఇరిగేష‌న్‌, వ్యూహాత్మక నాలా అభివృద్ధి (ఎస్​ ఎన్​ డీపీ) రాజెక్ట్ అధికారులతో పాటు కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తో క‌లి‌సి హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు. హ‌స్మ‌త్‌పేట‌, పికెట్ నాలాల‌ను ప‌రిశీలించారు. ప్యాట్నీ వ‌ద్ద‌ 17 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలాపై భాగంలో 150 మీటర్ల మేర కేవలం ఆరేడు మీటర్లకే పరిమితం అయినట్టు గుర్తించారు. దీంతో మ‌హేంద్ర హిల్స్‌, పికెట్‌, జేబీఎస్‌, బాలంరాయ్‌, విమాన్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని చెబుతూ పాత చిత్రాల‌ను స్థానికులు చూపించారు. ప్యాట్నీ వ‌ద్ద ఇటీవ‌ల కాలంలో కాలువ‌ను 17 మీట‌ర్ల మేర విస్త‌రించినా హ‌స్మ‌త్‌పేట‌, పికెట్ నాలాలు క‌లిసిన చోట కుంచించుకుపోవ‌డాన్ని స్థానికులు చూపించారు. నాలా కబ్జాలకు గురి కావడంతో వేలాది యిల్లు ప్రతిసారి నీట మునుగుతున్నాయని వాపోయారు.ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని హైడ్రాకు గత సోమవారం ఫిర్యాదు అందజేశామన్నారు. నగరంలో నాల పరిస్థితిపై కిర్లాస్కర్ కమిటీ, కిర్లోస్క‌ర్ క‌మిటీ, వోయంట్స్ క‌మిటీ నివేదికలతో పాటు,సర్వే ఆఫ్ ఇండియా, ఎన్​ఆర్​ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.