Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ లక్ష అందించిన ఎమ్మెల్యే యెన్నం 

 

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :

……………………………………..

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని  జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన “ జర్నలిస్టు సంక్షేమ నిధికి’ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి రూ. లక్ష విరాళం ఇచ్చారు. ప్రతినెలా రూ. లక్ష ఇస్తానని, తాను ఎమ్మెల్యే గా ఉన్నన్ని రోజులు ఈ విరాళం అందిస్తానన్నారు.గత నెలలో జర్నలిస్ట్ లకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఈ నిధులు అందించారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మంచి కార్యక్రమానికి తాను ఫండ్ ఇవ్వడం శుభపరిణామం అని ఆయన అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో ఆయన జర్నలిస్ట్ లను ఉద్దేశించి మాట్లాడారు.ఉగాది పండుగ సందర్భంగా తొలి విడతగా రూ.లక్ష చెక్కును జర్నలిస్ట్ ప్రతినిధులకు అందజేశానన్నారు.

ఈ సందర్భంగా  జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసినట్లు, అలాగే ఆ నిధికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు సంఘము సభ్యులు ఎమ్మెల్యే కు వివరించారు. నిధి నిర్వహణ, వినియోగ విధానం గురించి  వివరంగా తెలియజేశారు. జర్నలిస్టుల ప్రతిపాదనలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే  వెంటనే స్పందించి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష  చెక్కును జర్నలిస్టు ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా ఆపత్కాలంలో, అనారోగ్య పరిస్థితుల్లో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ సంక్షేమ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ నిధిని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి నిజంగా అవసరమైన వారికి ఉపయోగపడేలా చూడాలని ఆయన సూచించారు. జర్నలిస్టుల ఐక్యతతో ఈ నిధి మరింత బలపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన చేస్తున్న సహాయం జర్నలిస్టులకు భరోసాను కలిగిస్తుందన్నారు. అనంతరం జర్నలిస్ట్ లు ఎమ్మెల్యే  ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాలమూరు డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, నాయకులు మైత్రి యాదయ్య, జర్నలిస్ట్  సంఘం అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి, సభ్యులు సతీష్ కుమార్ రెడ్డి, సంతోష్ కుమార్, పల్లెమోని యాదయ్య, రఘు, రాఘవేందర్, రవి కుమార్, తిరుపతయ్య, కేశవులు, సతీష్, శ్రీకాంత్ జర్నలిస్టులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.