Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంపూర్ణ వికాసం సాధ్యం

మోత్కూరు, ముద్ర విలేఖరి:ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమైతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కే సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య బోధనను అందిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను పాట ప్రభుత్వ పాఠశాలలలోనే చదివించాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఇట్టి కార్యక్రమంలో ముందుగా ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులచే సన్మాన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనే విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని అన్నారు. కార్యక్రమంలో ముందుగా పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రసంగాలు పాటలు సభికులను అలరించాయి. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీ నరసింహారెడ్డి, సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్, తిరుమలగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ, పాఠశాల పూర్వ విద్యార్థులు అవిశెట్టి ఆవిలిమల్లు, గుజ్జ సోమ నరసయ్య, ఉపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు, అంజయ్య, రాంప్రసాద్, శ్రీనివాస్, ధర్మారపు వెంకటయ్య, ప్రవీణ్ కుమార్, వెంకటాచారి, లలితా కుమారి, రవీందర్ రెడ్డి, రామకృష్ణ, మంజుల, కవిత, జయశ్రీ రవికుమార్, స్వప్న, కవిత, సుధీర్ కుమార్, శశి కుమార్, వెంకటేశ్వర్లు అశోక్ శంకర్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.