ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందించారు.శ్రీ సుదర్శన చక్ర సహిత రాజగోపుర కలశ ప్రతిష్టాపన వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధికి ఈ విరాళం అందించారు.స్వామి వారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకొన్నారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు భుజంగ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగన్న, ఏనుగు లింగారెడ్డి, సామ వికాస్ రెడ్డి, కాలగిరి గంగారెడ్డి, బాపయ్య, ప్రతాప్ రెడ్డి, సల్కం శేఖర్, నర్సారెడ్డి, ఉమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ భూమేష్, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.