Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ కు రూ.50 వేల ఆర్థికసాయం

 ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బందెల రాజశేఖర్ అనే జర్నలిస్ట్ కు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50 ఆర్థికసాయం అందజేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాత్ పల్లికి చెందిన రాజశేఖర్ ఈ ప్రమాదంలో తన కాలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారుల నుంచి సేకరించిన నగదును జిల్లా వ్యవసాయాధికారి దోమ ఆదిరెడ్డితో కలిసి కాల్వశ్రీరాంపూర్ లోని రాజశేఖర్ నివాసానికి వెళ్లి అందజేశారు.అధికారుల సంఘం తరుపున అందరి సహకారంతో ఆదుకుంటామని అన్నారు.జర్నలిస్ట్ ను ఆదుకున్న అధికారులను పలువురు ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.