గొల్లపల్లి,ముద్ర : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల శ్రీ ముక్తేశ్వర స్వామి సహిత గట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సంతాన ప్రదాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం,ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ తిప్పర్తి సత్యచార్యులు ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.విగ్రహ విగ్రహ ప్రతిష్టాపన లో భాగంగా మొదటి రోజు ఆదివారం గణపతి పూజ,దీక్షా కంకణ ధారణ,మంటప పూజ,అధివాసములు,మూర్తి హవనం,బలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు.సోమవారం పుష్యమి నక్షత్ర యుక్త మేష లగ్నమున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.విగ్రహ దాత తిప్పర్తి లక్ష్మీపతి మౌనిక దంపతులు భక్తులతో కలిసి పూజలో కూర్చున్నారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ,అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దావు తిరుపతి,వేద పండితులు ,ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
