మొయినాబాద్ ముద్ర విలేకరి : మొయినాబాద్ మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన.. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల రాజేందర్ గౌడ్ గారిని షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షడు శివ చరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ లో పని చేసినందుకు గుర్తింపుగా ఒక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇంచార్జిగా నియామకం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ అవకాశం కల్పించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.