మొయినాబాద్ ముద్ర విలేఖరి : ప్రజలకు సేవా చేయాలనే మంచి ఆలోచనతో యువత వ్యాపారం ప్రారంభించడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పేర్కోన్నారు.మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో అదే గ్రామానికి చెందిన వడ్ల హరిశంకరాచారి శ్రీ వెంకటేశ్వర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మసీ కేంద్రం, మెడికల్ షాపును శుక్రవారం కార్తిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రారంభించాడు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయసులోనే వ్యా పారం ప్రారంభించడంతో వారిని అభినందించారు. వ్యాపారంలో లాభార్జనే ధ్యేయంగా కాకుండా నాణ్యమైన ఔషదాలను విక్రయించాలని సూచించారు. స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మరెడ్డి, ముదిగొండ రవియాదవ్, నరోత్తంరెడ్డి, కొత్త మానిన్రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు అరవింద్ రజక, దారెడ్డి కృ ష్ణారెడ్డి, అంజయ్య గౌడ్, అతిక్, తదితరులు ఉన్నారు.