మహదేవపూర్, ముద్ర:
జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు మరియు జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గృహ వినియోగ వినియోగదారులతో పాటు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ సిలిండర్లు ప్రాధాన్యతతో సరఫరా చేయబడుతున్నట్లు తెలిపారు.గ్యాస్ గోదాములు మరియు పంపిణీ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేసేందుకు డీటీ, ఆర్‌ఐ, ఎస్‌ఐలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలను గుర్తించి చట్టపరమైన చర్యలు కోవాలని తీసుకోవాలని ఆదేశించారు.
శుక్రవారం సివిల్ సప్లైస్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 6 కేసులు నమోదు చేసి, 13 గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం, 1955 సెక్షన్ 6ఏ మరియు సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా యంత్రాంగ సమాచారం మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలకు కోరారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితిపై ప్రతిరోజూ నివేదికను రాష్ట్ర స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీకి పంపుతున్నామని
ఈ కమిటీలో ఎస్పీ, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాంతీయ మేనేజర్లు, ఆర్‌టీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖల జిల్లా సంక్షేమ అధికారులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘ ప్రతినిధి సభ్యులుగా ఉంటారని, జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.