Take a fresh look at your lifestyle.

కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు : మంత్రి అడ్లూరి

మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..
అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..

అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించిన స్పందించని కెసిఆర్..

రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి..?

ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడడం తగదు..

కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..

ముద్ర, కరీంనగర్:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు.

రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు.

ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ముఖ్యమంత్రి గారితో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు. మీడియా సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.