Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే సహాకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం : మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాలఅభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నారని భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు అన్నారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బొల్లెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో ఏచ్ఎండీఏ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పల్లెలే పట్టుకొమ్మలని అలాంటి పల్లెల్లో అభివృద్ధి పనులను పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా గత పది సంవత్సరాల నుండి కూడా గ్రామ పంచాయితీకి అరకొర నిధుల వలన అభివృద్ధి జరగడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారానే గ్రామాలలో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గడ్డమీద చంద్రకళ వీరస్వామి గౌడ్, రెడ్డి సంఘం అధ్యక్షులు జిట్టా కృష్ణారెడ్డిరెడ్డి ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్,గుండు కిష్టయ్య, ఇంద్రమ్మ కమిటీ నెంబర్ మాద సత్యనారాయణ,హనుమాన్ యూత్ అధ్యక్షులు బుంగపట్ల రమేష్, మాజీ వార్డ్ మెంబర్ బద్దం సంపత్ రెడ్డి, దాసరి బాల్ కుమార్,గడ్డమీద స్వామి,జిట్ట నర్సిరెడ్డి, పిన్నింటి వెంకటరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.