- రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి.
మహాదేవపూర్, ముద్ర: బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాన్ని పౌరుల హక్కులను కాలరాస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాటారం మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహాత్మ గాంధీ చూపినటువంటి శాంతి అహింస సిద్ధాంతాలను బిజెపి పూర్తిగా విస్మరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మంథని నియోజకవర్గంలో ఈ ఉద్యమాన్ని కార్యకర్తలు అందరికంటే ముందుంచే ప్రయత్నం చేయాలని,ఈ ఉద్యమం ద్వారా యువతకు, మహిళలకు, ప్రజలకు రాబోయే కాలంలో జరగబోయే రాజ్యాంగ సంక్షోభాన్ని వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి రాజేశ్వరి పలు గ్రామాల సర్పంచులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీ నిర్వహించిన అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
