ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి పాలన చేయటం సిగ్గు చేటని బీజేపీ నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించి ఇపుడు వాటిని తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిసిమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరిపే విలాస్, నల్లా రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్ర రాజరెడ్డి, ఆఫీస్ సెక్రటరీ రాచకొండ సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, వివిధ మండలాల అధ్యక్షులు మార గంగారెడ్డి, నరేందర్, కాల్వ నరేష్, రంజిత్, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.