Take a fresh look at your lifestyle.

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న ఏ డి ఏ ఎస్ , ఎం ఏ ఓ ఎస్, ఏ ఈ ఓ ఎస్ కు మార్కెటింగ్, కోపరేటివ్, సివిల్ సప్లయస్ శాఖలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించి తేమశాతం పరిశీలించాలన్నారు. వరి కుప్పలను పరిశీలించి వాటి నాణ్యత పరిశీలించవలసినదిగా ఆదేశించారు. అన్ని కుప్పలు త్వరగా మాయిశ్చర్ వచ్చాయా అని పరిశీలించాలన్నారు. అశ్రద్ధ వహించిన యెడల సంబంధిత వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి స్ప్రెడ్ షీట్ పెట్టి ఉదయం సందర్శించి, రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. దీనిలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించబో మని సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగిందని ధాన్యం పరిశీలన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని, ఉదయం ఆరు నుండే ఫీల్డ్ లో ఉండాలని, నాణ్యత కలిగిన ధాన్యమును మాత్రమే మిల్లులకు తరలించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి , జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.