ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడ్డాయని, వారు సమన్వయంతో పనిచేస్తే జనగణన విజయవంతంగా పూర్తి చేయగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.