ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాకు ఈ విద్యా సంవత్సరానికి పదవ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. విజయ తెలిపారు. బుధవారం రాష్ట్ర పరీక్షల విభాగం, హైదరాబాద్ నుండి మెదక్ జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. మెదక్ జిల్లాకు తొలిసారిగా పదవ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మూల్యాంకన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ సమిష్టి కృషితో సహకరించాలని ఆమె కోరారు. అదేవిధంగా, అన్ని ఉపాధ్యాయుల సంఘాలు కూడా తగిన సహకారం అందించి మూల్యాంకన కేంద్రం విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.