Take a fresh look at your lifestyle.

పెరుగు తినమన్నందుకు ఇల్లాలు అదృశ్యం: కేపీహెచ్‌బీలో కేసు నమోదు

ముద్ర కూకట్‌పల్లి:

తిండి అలవాట్లపై భర్త చేసిన సూచన మనస్తాపానికి గురిచేయడంతో ఓ వివాహిత ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోరకొండకు చెందిన దాసరి శివకుమార్ (21), కెపిహెచ్‌బి కాలనీలోని షంషీగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శివకుమార్‌కు 2024 మే 28న రాజేశ్వరి (21)తో వివాహం జరిగింది.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం అతను తన భార్యతో మాట్లాడుతూ “నువ్వు చాలా బక్కగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉండటానికి పెరుగు తినడం అలవాటు చేసుకో” అని చెప్పాడు. ఈ చిన్న మాటను మనసులో పెట్టుకున్న రాజేశ్వరి, అప్పటి నుండి భర్తతో సరిగ్గా మాట్లాడటం లేదు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు శివకుమార్, అతని తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఉదయం 10:20 గంటల సమయంలో తండ్రి ఇంటికి తిరిగి వచ్చి చూడగా, తాళం వేసి ఉంది. శివకుమార్ వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించగా, రాజేశ్వరి తన బట్టలు తీసుకొని వెళ్ళిపోయినట్లు గుర్తించారు. బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భర్త ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ అవినాష్ బాబు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
End

Leave A Reply

Your email address will not be published.