ముద్ర, తుంగతుర్తి..
సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని ఆయన చిన్నతనం నుండే కుల వివక్షత పై ఎన్నో పోరాటాలు చేశారని దళితుల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండగాని రాములు గౌడ్ ,తడకమళ్ళ రవికుమార్ , గోపగాని రమేష్, బొజ్జ సాయికిరణ్, బొంకురి మల్లేష్, నల్లబిల్లి వెంకటేష్, బొంకూరి మధు, తడకమళ్ళ నరేష్,తడకమళ్ళ అనిల్, తడకమళ్ళ మధు, బొంకూరి సాయి, కడియం గోపి, గడ్డం నితిన్ తదితరులు పాల్గొన్నారు.