వాడవాడల తిరుగుతూ.. రెండేళ్ల అభివృద్దిని వివరిస్తు..
ధర్మపురి మున్సిపాలిటి పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మంత్రి అడ్లూరి..
వార్డు సమస్యను వివరిస్తున్న ఓటర్లు.. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న మంత్రి
ధర్మపురి:
మున్సిపాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణంలో వాడ వాడల తిరుగూ అభివృద్దిని వివరిస్తున్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ వైపల్యాలను ఎండగడుతూ రెండేళ్ల అభివృద్దిని ఓటర్లకు వివరిస్తు మంత్రి ముందుకు సాగుతున్నారు. ఈసందర్భంగా వార్డులోని సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇస్తున్నారు.

మున్సిపాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని6వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డుల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని 15వార్డులకు గాను 15వార్డుల్లో విజయం సాధిస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురిలో బీజేపీ పార్టీ ఖాతా తెరవదని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి సైతం ప్రజలు సిద్దంగా లేరని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి ఓటర్లకు వివరించారు. రానున్న రోజుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను భారీ మోజార్టీతో గెలిపించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓటర్లను కోరారు.