ముద్ర, బిజినెస్
‘ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీస్ మార్కెట్’ పేరిట సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఉద్యోగుల కోసం ఈ ప్రోగ్రాంలు నిర్వహించబడ్డాయి. ఇన్వెస్ట్‌మెంట్ మరియు సెక్యూరిటీస్ మార్కెట్‌కి సంబంధించిన ప్రాథమికాంశాల గురించి తెలియజేసేలా, అలాగే బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్, డిపాజిటరీల పాత్ర మరియు పని తీరు, ఇన్వెస్టర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి అందుబాటులో ఉన్న సాధనాలు మొదలైన వాటి గురించి అవగాహనను పెంపొందించేలా ఈ సెషన్లు రూపొందించబడ్డాయి. పూర్తి సమాచారంతో, సురక్షితంగా, నిర్మాణాత్మకమైన విధంగా ఆర్థిక మార్కెట్లలో పాలుపంచుకునేలా ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్ారు. సమగ్రమైన ఉదాహరణలు, ఇంటరాక్టివ్ చర్చల ద్వారా కీలకమైన ఇన్వెస్టింగ్ కాన్సెప్టుల సంబంధించిన కీలకాంశాలను ఈ ప్రోగ్రాంలు సవివరంగా తెలియజేశాయి. ప్రజలు AtmanirbharInvestor గా మారేలా సాధికారత కల్పించే దిశగా, ఆర్థిక అక్షరాస్యతను విస్తరించడంతో పాటు దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ కట్టుబడి ఉంది.