మంథని, ముద్ర : మంథని మండలం సిరిపురం గ్రామంలో సబ్ సెంటర్ సిరిపురం పీహెచ్సీ గద్దలపల్లి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఎండకాలంలో వచ్చే వడ దెబ్బ వడగాలుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణించాల్సి వస్తే పొద్దున సాయంత్రం బయటకు వెళ్లే ముందు తలకు రుమాలు, గొడుగు ఉపయోగించుకోవాలని నీళ్లు వెంట ఉంచుకోవాలని వేసవిలో ఓఆర్ఎస్ గాని నిమ్మరసం ఉప్పు చక్కెర కలిపిన నీటిని తాగాలి వడ దెబ్బ తగిలిన వారు సొమ్మసిల్లి పోవడం తలనొప్పి జ్వరం వేగంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పీ జి.శ్రీజ, ఏ ఎన్ ఎం వీరమ్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.