Take a fresh look at your lifestyle.

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

  • కమిషనర్ మహమూద్ షేక్.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి: వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ మాముద్ షేక్ అన్నారు.శనివారం పుర కార్యాలయంలో ఏఈ షబ్బీర్ తో కలిసి, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజీ లేకుండా చూడాలని ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.నీళ్లు వృధా కాకుండా చూడాలని కుళాయిలకు బిరడులు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్య వస్తే కాలనీవాసులు పుర సిబ్బంది దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో వార్డ్ ఆఫీసర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.