- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి :అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.శనివారం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని కడ్తాల్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.పంటలు కోతకు వచ్చిన దశలో అకాల వర్షాలు పడి రైతుల ను తీవ్రంగా నష్టపరిచిందని, అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.వర్షాలు పడే అవకాశం ఉన్నందున కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.